అక్షరటుడే, కమ్మర్పల్లి: Intermediate Education | మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని డీఐఈవో రవికుమార్ (DIEO Ravi Kumar) పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండల (Kammarpally mandal) కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కళాశాలలోని అన్ని రకాల రిజిస్టర్లను పరిశీలించారు. కళాశాలలో అడ్మిషన్లు, విద్యార్థుల హాజరుశాతాన్ని ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ మధు కుమార్‌ను (in-charge principal Madhu Kumar) అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంటర్ విద్యాధికారి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు కళాశాలకు వచ్చేవిధంగా చూడాలన్నారు. విద్యార్థులకు 75శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉంటే ఎగ్జామ్ ఫీజు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుందని, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి స్పెషల్ క్లాసులు (special classes) నిర్వహించి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా చూడాలని ఆదేశించారు.
ఈ ఏడాది కమ్మర్పల్లి కళాశాలలో అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని ఇందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యాపక సంఘం అధ్యక్షుడు నర్సయ్య, అధ్యాపకులు రాజ్‌కుమార్, గంగాధర్, గంగారాం, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ, వైష్ణవి, స్వాతి, సుమతి, స్రవంతి పాల్గొన్నారు.