Homeజిల్లాలుకామారెడ్డిBJP Banswada | కేంద్ర పథకాలు ఇంటింటికీ చేరేలా కృషి చేయాలి

BJP Banswada | కేంద్ర పథకాలు ఇంటింటికీ చేరేలా కృషి చేయాలి

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: BJP Banswada | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరేలా కృషి చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస రెడ్డి సూచించారు.

బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి ఆధ్వర్యంలో మండల బీజేపీ నూతన కమిటీని శుక్రవారం ప్రకటించారు. పట్టణ ప్రధాన కార్యదర్శులుగా చిరంజీవి, ఉమేష్, ఉపాధ్యక్షులుగా గజ్జల మహేష్, కొట్టం రామకృష్ణ, కొనాల విజయలక్ష్మి, గుడుగుట్ల అనిల్, పట్టణ కోశాధికారిగా సిద్ది బాలరాజ్ నియమితులయ్యారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని వారికి సూచించారు.