Collector Vinay Krishna Reddy
Nizamabad Collector | వనమహోత్సవ లక్ష్యసాధనకు కృషి చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | వన మహోత్సవ లక్ష్యాలను (Vana mahotsavam) పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.

మండల ప్రత్యేక అధికారులతో పాటు సూపర్​వైజర్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు తప్పనిసరిగా నర్సరీలు, వైకుంఠధామాలు, ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించాలని ఆదేశించారు. నాటిన మొక్కల స్థితిగతులను తప్పనిసరిగా పరిశీలన చేయాలని తెలిపారు. అటవీశాఖ అధికారులు (Forest Department) ప్రతి గ్రామపంచాయతీని విధిగా సందర్శించి మొక్కల పెంపకాన్ని పరిశీలించాలన్నారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటాలని సూచించారు. నగర పాలక సంస్థ (Municipal Corporation) ఆధ్వర్యంలో కూడా నర్సరీ నిర్వహణ చేపట్టాలని కమిషనర్​ను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, డీఎఫ్​వో వికాస్ మహతో, డీఆర్​డీవో సాయా గౌడ్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.