ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Collector | వన మహోత్సవం లక్ష్యసాధనకు కృషి చేయాలి

    Nizamabad Collector | వన మహోత్సవం లక్ష్యసాధనకు కృషి చేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | నిర్దేశిత గడువులోపు వనమహోత్సవం (Vana mahotsavam) లక్ష్యానికి అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో సమాయత్తం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్​లో శనివారం పలు అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతేడాది నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని సూచించారు. మొక్కలు నాటిన ప్రతిచోట వివరాలతో కూడిన నేమ్​బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత సీజన్ లో మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను పరిశీలించాలని తెలిపారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీలను సిద్ధం చేస్తూ నిర్దేశిత ప్రదేశాల్లో గుంతలు తవ్వించాలని సూచించారు. నాటిన మొక్కలు సంరక్షించబడేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

    Nizamabad Collector | ఫ్రైడే-డ్రైడేగా అమలు చేయాలి..

    సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యల్లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం జిల్లా వ్యాప్తంగా నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాల్లో ఫ్రైడే (Friday-Dry Day) డ్రై డేగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దోమల నివారణ కోసం తప్పనిసరిగా ఫాగింగ్ జరిపించాలన్నారు. మురికి నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్, మంచినీటి వాటిలో గంబుషియా చేప పిల్లలను (Gambusia fish) వదలాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    Nizamabad Collector | క్రమబద్ధీకరణ పత్రాలు అందించాలి..

    అలాగే ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన వారికి తొందరగా క్రమబద్ధీకరణ పత్రాలు అందించాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు ఎల్ఆర్ఎస్ రాయితీ (LRS) అమలులో ఉన్నందున.. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్​లో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా (Forest Officer Vikas Meena), డీఆర్డీవో సాయ గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ (Municipal Corporation Commissioner Dilip Kumar), హౌసింగ్ అధికారి నివర్తి, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Yoga | మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: ధన్​పాల్​

    అక్షరటుడే, ఇందూరు: Yoga | మోదీ ప్రధాని అయిన తర్వాత యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అర్బన్ ఎమ్మెల్యే...

    Choreographer Krishna | పోక్సో కేసు.. ఢీ డ్యాన్సర్, కొరియోగ్రాఫ‌ర్ కృష్ణ మాస్ట‌ర్ అరెస్ట్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Choreographer Krishna | తెలుగు సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్లీ చర్చకు తెరలేపాయి....

    Congress | కాంగ్రెస్​లో వర్గపోరు.. మంత్రి ఎదుటే గొడవకు దిగిన నాయకులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | గజ్వేల్​ నియోజకవర్గ (Gajwel Constituency) కాంగ్రెస్​ పార్టీలో వర్గపోరు నెలకొంది. మంత్రి...

    Health Camp | మెగా ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Health Camp | నగరంలోని శివాజీ నగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉచిత...

    More like this