Homeజిల్లాలుకామారెడ్డిMLA Madanmohan Rao | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి

MLA Madanmohan Rao | ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: MLA Madanmohan Rao : నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నానని, 15 నెలల్లోనే 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. ఎల్లారెడ్డి, గాంధారి, లింగంపేట మండలాల్లో బుధవారం పలు అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ చేశారు.

గాంధారి మండలంలోని పోతంగల్‌లో విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. పేట్‌సంగంలో రైతులకు రూ.13 లక్షల వ్యయంతో 150 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం ప్రారంభించారు.

రూ.1.5 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు, లక్ష్మాపూర్, ఎల్లారెడ్డి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.