Nandipet
Nandipet | మున్నూరుకాపు కల్యాణ మండపం అభివృద్ధికి కృషి

అక్షరటుడే, నందిపేట/ఆర్మూర్‌: Nandipet | మండలకేంద్రంలో మున్నూరుకాపు సంఘం కల్యాణ మండప అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి (Congress Armur constituency incharge) వినయ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. నందిపేటలోని మున్నూరు కాపు కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కల్యాణ మండపంలో డైనింగ్‌ హాల్‌తోపాటు ఇతర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local body elections) అభ్యర్థుల ఎంపిక బాధ్యత అధిష్టానిదేనన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి నందిపేట్‌ మండల మున్నూరు కాపు సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Nandipet | కాంగ్రెస్‌లో భారీగా చేరికలు..

నందిపేట్‌ మండలంలోని సీహెచ్‌ కొండూరులో బీఆర్‌ఎస్‌ నాయకులు పలువురు కాంగ్రెస్​లో చేరారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌ కుమార్‌ రెడ్డి సమక్షంలో చేరగా, వారికి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో మాజీ సర్పంచ్‌ ప్రభాకర్‌ రావు, మాజీ ఉప సర్పంచ్‌ మంగు సందీప్, బాలనోళ్ల దేవిదాస్, నాయకులు వెలువల నర్సయ్య, బోండ్ల వెంకటేశ్, ఆర్య ప్రవీణ్, గుండు నాగేష్, ఆరే మీసాల రాజు, తెనుగు దేవేందర్, షాదుల్లా, జింకల శ్రీనివాస్, లక్కంపల్లి నవీన్, పెద్ద నాగరావు, గోనేటి దేవరెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో నందిపేట్‌ మండల అధ్యక్షుడు మంద మహిపాల్‌ పాల్గొన్నారు.