అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rains | తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఉదయం నుంచే వర్షం పడుతోంది. ఈ రోజు రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. భారీ వర్ష సూచన ఉండటంతో జీహెచ్‌ఎంసీ (GHMC) ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తం అయ్యాయి. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు.
వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ (GHMC) వ్యాప్తంగా బుధ, గురువారాల్లో మధ్యాహ్నం వరకు మాత్రమే పాఠశాలలు (Schools) తెరిచి ఉంచాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. గురువారం సైతం నగరానికి రెడ్ అలెర్ట్ ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఐటీ కంపెనీలు రేపు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ (WFH) ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. దీంతో రోడ్లపై ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. అలాగే ప్రజలు సైతం నేడు, రేపు అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. ఉద్యోగులు ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడకుండా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలన్నారు.
Heavy Rains | 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్
రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) చేశారు. హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, సూర్యాపేట, నల్గొండ, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో రాత్రిపూట కుండపోత వాన పడనుంది. కాగా ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి వాన దంచికొట్టింది