MLA Kaushik Reddy
MLA Kaushik Reddy | సీఎంపై అనుచిత వ్యాఖ్య‌ల ఎఫెక్ట్.. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: MLA Kaushik Reddy | హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు శ‌నివారం కేసు న‌మోదు చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డిపై (Chief Minister Revanth Reddy) అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని కాంగ్రెస్ నేత‌లు చేసిన ఫిర్యాదుపై స్పందించిన రాజేంద్రన‌గ‌ర్ పోలీసులు ప‌లు సెక్షన్ల కింద కేసు పెట్టారు. శుక్రవారం విలేక‌రుల‌తో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి.. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న హీరోయిన్ల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశార‌ని ఆరోపించారు.

“రేవంత్ రెడ్డి నువ్వు ఇట్లనే నోటికొచ్చినట్టు మాట్లాడితే.. నువ్వు ఎవ్వరితో తిరిగావో ఆ 16 మంది పేర్లు బయటపెడతా.. నువ్వు జూబ్లీహిల్స్ లో ఎక్కడ పడుకున్నావో, దుబాయ్(Dubai)లో ఎక్కడ పడుకున్నావో, ఢిల్లీలో ఎక్కడ పడుకున్నావో నాకు అన్ని తెలుసు.. నేను కాంగ్రెస్ పార్టీ (Congress party) నుంచి వచ్చాను. నీ స్టోరీలన్నీ నాకు తెలుసు. మిస్ వరల్డ్ పోటీదారుల (Miss World contestants) ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. తనవి ఆరోపణలు కాదు వాస్తవాలు” అని కౌశిక్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసిన కాంగ్రెస్ శ్రేణులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి. ఈ క్రమంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి.. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

MLA Kaushik Reddy | కౌశిక్‌రెడ్డి ఇంటి వ‌ద్ద హైడ్రామా..

పాడి కౌశిక్‌రెడ్డి సీఎంపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఎన్ఎస్​యూఐ నేత‌లు (NSUI leaders) ఆయ‌న ఇంటి ముట్ట‌డికి పిలిపించారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ఆయనపై దాడి చేస్తారన్న అనుమానంతో బీఆర్‌ఎస్‌ నాయకులు (BRS leaders) కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్‌ చేయిస్తూ వారిని బ్లాక్‌మెయిల్‌ చేయిస్తున్నారని శుక్రవారం ఆరోపించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ (phone tapping) చేయిస్తున్నట్టు రేవంత్‌రెడ్డి స్వయంగా అంగీకరించారని, కాబట్టి దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడి చేయవచ్చనే అనుమానంతో బీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్నారు.