Homeజిల్లాలుకామారెడ్డిConstable Suspension | అదనపు వసూళ్లు.. కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు

Constable Suspension | అదనపు వసూళ్లు.. కానిస్టేబుల్​పై సస్పెన్షన్​ వేటు

కామారెడ్డిలో అదనపు వసూళ్లకు పాల్పడిన కానిస్టేబుల్​పై వేటుపడింది. ఈ మేరకు కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Constable Suspension | బాధితుల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న కానిస్టేబుల్​పై సస్పెన్షన్ (Constable Suspension) వేటు పడింది. ఈ మేరకు కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ (Banswada) పరిధిలో పేకాట కేసులో 9 మందిని అరెస్ట్ చేసి ఈనెల 6న కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారికి జరిమానా విధించగా కోర్టులో పనిచేస్తున్న కానిస్టేబుల్ బుక్యా శ్రీను జరిమానా కాకుండా అదనంగా వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో శాఖాపరంగా అంతర్గతంగా విచారణ చేపట్టారు. విచారణలో అదనపు డబ్బులు వసూలు చేసినట్టు తేలడంతో కానిస్టేబుల్ శ్రీనును సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది అనైతిక చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Must Read
Related News