అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eesha Rebba | తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందచందాల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అయితే ఆమెకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. ప్రముఖ డైరెక్టర్, నటుడు తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) ను వివాహం చేసుకోనుందని రూమర్స్ ఎక్కువయ్యాయి.
టాలీవుడ్ (Tollywood)లో హాట్ టాపిక్‌గా మారిన ఈషా రెబ్బా తరుణ్ భాస్కర్ పెళ్లి రూమర్లపై తాజాగా ఈషా స్పందించారు. వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతి’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ (Movie Verse Studios) సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 23న థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై అంచనాలు పెరుగుతుండగానే, హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లి అంటూ రూమర్లు ఊపందుకున్నాయి.
Eesha Rebba | ఇంకా సస్పెన్స్ లోనే..
సినిమా షూటింగ్ సమయంలోనే ఈషా రెబ్బా, తరుణ్ భాస్కర్ ప్రేమలో పడ్డారని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని ప్రచారం జరిగింది. అంతేకాదు, వీరిద్దరూ కలిసి తిరుమల దర్శనానికి వెళ్లిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో నెటిజన్లలో “ఇద్దరూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా?” అనే చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో తాజాగా ఈషా రెబ్బా ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేస్తూ రూమర్లకు కౌంటర్ ఇచ్చింది.“ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?” అని పదే పదే అడిగే వారికి సమాధానంగా, ఓ వైరల్ మీమ్ వీడియోను పోస్ట్ చేసింది.
ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ఇంగ్లిష్ స్పీచ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగిస్తూ, “ఏ పనులు ఏ సమయాల్లో జరగాలో… అవి ఆ సమయాల్లో కచ్చితంగా జరిగి తీరుతాయి” అనే డైలాగ్‌ను జత చేసింది. తన పెళ్లి విషయంలో కాలమే నిర్ణయిస్తుందని, ఇప్పట్లో ఎలాంటి తొందర లేదన్న సంకేతాన్ని ఈషా ఈ వీడియో ద్వారా ఇచ్చినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూ, క్రేజీ కామెంట్స్‌ను దక్కించుకుంటోంది.ఇక ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా ఓ మలయాళ హిట్ మూవీకి రీమేక్‌గా తెరకెక్కినట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్ నెలకొంది. మరి ఈ సినిమా విజయం ఈషా – తరుణ్ భాస్కర్ జంటకు ఏ స్థాయి క్రేజ్ తెస్తుందో చూడాలి.