HomeతెలంగాణACB Raids | కోట్లకు పడగలెత్తిన ఈఈ శ్రీధర్.. థాయ్​లాండ్​లో కొడుకు పెళ్లి

ACB Raids | కోట్లకు పడగలెత్తిన ఈఈ శ్రీధర్.. థాయ్​లాండ్​లో కొడుకు పెళ్లి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: ACB Raids | ఇరిగేషన్​ శాఖ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్(Irrigation Department Executive Engineer)​ నూనె శ్రీధర్​ కోట్లకు పడగలెత్తాడు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్​ ఈఈగా పనిచేసిన ఆయన 6, 7, 8 ప్యాకేజీ పనులను పర్యవేక్షించారు. ఈఈగా ఆయన భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారు. ప్రస్తుతం కరీంనగర్​ జిల్లా చొప్పదండి ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయం(SRSP Camp Office)లో ఈఈగా పనిచేస్తున్న ఆయన నివాసాలసై ఏసీబీ అధికారులు(ACB Raids) దాడులు చేశారు. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆక్రమ సంపాదన చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.

ACB Raids | భారీగా స్థిరాస్తులు

రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఈ శ్రీధర్​కు భారీగా స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించారు. వరంగల్​లో 3 అంతస్తుల భవనం, మలక్‌పేటలో 4 అంతస్తుల భవనం, షేక్‌పేటలో స్కై హైలో 4,500 చదరపు అడుగుల ఫ్లాట్, తెల్లాపూర్‌లోని ఉర్జిత్ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా ఉన్నాయి.

ACB Raids | థాయ్​లాండ్​లో డెస్టినేషన్​ వెడ్డింగ్​

అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఈఈ శ్రీధర్​ తన కొడుకు పెళ్లిని థాయ్​లాండ్(Thailand)​లో నిర్వహించడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్ట్​ (Kaleshwaram Project)నిర్మాణ సమయంలో ఈయన భారీగా సంపాదించినట్లు ఆరోపణలున్నాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి తన కుమారుడికి థాయ్​లాండ్​లో డెస్టినేషన్​ వెడ్డింగ్​(Destination Wedding) జరిపించాడంటే ఆయన అక్రమ సంపాదన ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆయనకు ఉన్న ఆస్తుల విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈఈ శ్రీధర్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.