అక్షరటుడే, ఇందూరు: Agricultural College | విద్యారంగ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ అన్నారు. జిల్లాకు వ్యవసాయ కళాశాలను (agricultural college) మంజూరు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో (R&B Guest House) శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాల మంజూరులో కీలక పాత్ర పోషించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud), ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ విశ్వవిద్యాలయం, మెడికల్ కళాశాల (Telangana University and medical college) ఏర్పాటు చేసి విద్యారంగం పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల, వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా విద్యారంగా అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో విద్యారంగ అభివృద్ధి పూర్తిగా కుంటపడిందని గుర్తు చేశారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా పేరుపొందిన నిజామాబాద్‌లో వ్యవసాయ కళాశాల వల్ల అనేక పరిశోధనలు జరిగి నూతన విప్లవానికి నాంది పలుకుతుందన్నారు. కళాశాల ద్వారా కొత్త వంగడాలు సృష్టించాలని, అనేకమంది వ్యవసాయ శాస్త్రజ్ఞులు తయారు కావాలని ఆకాంక్షించారు. సమావేశంలో పూర్వ విద్యార్థులు దత్తు, సతీష్, రమేష్, మీరన్, విశాల్, జగన్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.

