అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివాదాస్పదంగా మారిన జూనియర్ అసిస్టెంట్‌పై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
గత నెల రోజులుగా సంబంధిత ఉద్యోగి కారణంగా ఇబ్బందులు పడుతున్నామంటూ కార్యాలయ సిబ్బంది డీఈవో అశోక్‌కు (DEO Ashok), కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి (Collector వినయ్ కృష్ణారెడ్డి) ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ‘అక్షరటుడే’ పలు కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగిని నగరంలోని వెంగళరావు నగర్ ప్రభుత్వ పాఠశాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు తెలిసింది.
Education Department | గతంలోనూ అనేక ఫిర్యాదులు
విద్యాశాఖలో (District Education Office) పనిచేస్తున్న సదరు జూనియర్ అసిస్టెంట్ (junior assistant) వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ గతంలోనూ ఇతర ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో డీఈవో ఆఫీస్‌లో ఉన్న సుమారు 36 మంది ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చారు. సదరు జూనియర్ అసిస్టెంట్ తరచూ ఇతరులతో గొడవలకు దిగడం, తనకు ఆదాయం ఉన్న సెక్షన్ కేటాయించాలని ఒత్తిడి తేవడం, ప్రైవేటు పాఠశాలల్లో (private schools) వసూళ్లకు పాల్పడడం, అంతర్గత సమాచారాన్ని ఇతరులకు పంపడం వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు.
Education Department | సంతకాలు చేయకుండా నిరసన..
జూనియర్ అసిస్టెంట్ వ్యవహార శైలితో విసిగిపోయిన ఉద్యోగులంతా గత శుక్ర, శనివారాల్లో హాజరుపట్టికలో సంతకాలు కూడా చేయలేదు. ఈ విధంగా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు సదరు ఉద్యోగిని డీఈవో కార్యాలయం నుంచి ఇతర స్కూల్‌కు బదిలీ చేశారు.