అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Minister Adluri Laxman | సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) విద్య, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman) అన్నారు. భూపాలపల్లిలో ఆయన పలు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
హాస్టల్ నిర్వహణ, మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలు, వైద్య సేవలు (medical services), భద్రతా ఏర్పాట్లపై మంత్రి చర్చించారు. పేద, అణగారిన బలహీన వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్య ద్వారా బలమైన భవిష్యత్తును నిర్మించుకునేలా ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తోందని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్య, ఆహారం విషయాలలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. హాస్టళ్లలో నివసించే విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సూచించారు. విధుల్లో ఏమాత్రం అలసత్వం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Minister Adluri Laxman | నాణ్యమైన విద్య
సంక్షేమ హాస్టళ్లు (welfare hostels) భోజనం, వసతి కల్పించడానికి మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కేంద్రాలుగా పనిచేయాలని అన్నారు. మెరుగైన విద్యా ప్రమాణాల ద్వారానే మంచి ఫలితాలు సాధించగలమని చెప్పారు. ప్రతి హాస్టల్లో స్టడీ అవర్స్‌ను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా పర్యవేక్షణ ఉండేలన్నారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అనుమతి లేకుండా విద్యార్థులు హాస్టళ్ల నుంచి బయటకు వెళ్లొద్దన్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రతి హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి అడ్లూరి ఆదేశించారు.