అక్షరటుడే, ఇందల్వాయి : Nutritious Food | ఆరోగ్యవంతమైన జీవన విధానానికి పౌష్టికాహారం ఎంతో దోహదపడుతుందని చంద్రాయన్ పల్లి (Chandrayan Palli) ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు.
Nutritious Food | విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలి
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని తల్లిదండ్రులకు హెచ్ఎం శ్రీనివాస్ (HM Srinivas) వివరించారు. విద్యార్థులకు నిత్యం అందించే ఆహార పదార్థాలు కాకుండా పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తే కలిగే లాభాల గురించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు బోధించారు. విద్యార్థులకు (Students) చదువుతో పాటు ఆరోగ్యం ఎంతో ముఖ్యమని సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
Nutritious Food | ఆహారపదార్థాల ప్రదర్శన
పాఠశాలలోని ప్రతి విద్యార్థి తమ ఇంట్లో వివిధ రకాల పౌష్టికాహార వంటకాలను చేయించి పాఠశాలలో ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.