Homeబిజినెస్​Physics Wallah IPO | ఐపీవోకు ఎడ్‌టెక్‌ కంపెనీ.. వచ్చేవారంలో ‘Physics Wallah’ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

Physics Wallah IPO | ఐపీవోకు ఎడ్‌టెక్‌ కంపెనీ.. వచ్చేవారంలో ‘Physics Wallah’ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం

ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ ఫిజిక్స్‌వాలా ఐపీవోకు రానుంది. వచ్చేవారంలో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 3,480 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా ఈ సంస్థ ముందుకొస్తుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Physics Wallah IPO | ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ అయిన ఫిజిక్స్‌వాలా ఐపీవోకు (IPO) వస్తోంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 3,480 కోట్లు సమీకరించాలన్నది లక్ష్యం. వచ్చేవారంలో సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభం కానుంది.

ఫిజిక్స్‌వాలా (Physics Wallah) అనేది జేఈఈ, నీట్‌, యూపీఎస్‌సీ మొదలైన వివిధ పోటీ పరీక్షలకు పరీక్ష తయారీ కోర్సులు, డేటా సైన్స్‌ మరియు అనలిటిక్స్‌, బ్యాంకింగ్‌ మరియు ఫైనాన్స్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ వంటి అప్‌స్కిల్లింగ్‌ కోర్సులను అందించే ఎడ్‌టెక్‌ కంపెనీ. 2016లో పోటీ పరీక్షలకు ఫిజిక్స్‌ పాఠాలు బోధించే యూట్యూబ్‌ ఛానల్‌గా ప్రారంభమైన ఫిజిక్స్‌వాలా.. 2020లో ఎడ్‌టెక్‌ సంస్థగా ఎదిగింది. ఇది సోషల్‌ మీడియా ఛానళ్లు, వెబ్‌సైట్‌ మరియు యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ సేవలను అందిస్తోంది. సాంకేతికతతో కూడిన ఆఫ్‌లైన్‌ సెంటర్లు, హైబ్రిడ్‌ సెంటర్లను (Hybrid Centers) కూడా నిర్వహిస్తోంది. ఇది భారతదేశంలో ఆదాయాల పరంగా టాప్‌ 5 ఎడ్‌టెక్‌ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది.

ప్రస్తుతం ఈ సంస్థ యూట్యూబ్‌ ఛానల్‌కు (YouTube Channel) 1.39 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌ వరకు 13 విద్యా వర్గాల్లో బహుళ కోర్సులకు సంబంధించి 4,382 పుస్తకాలు ప్రచురించింది. జూన్‌ 30 నాటికి 303 ఆఫ్‌లైన్‌ కేంద్రాలు, 6,267 మంది ఫ్యాకల్టీ సభ్యులు, 18,028 మంది ఉద్యోగులు ఉన్నట్లు డీఆర్‌హెచ్‌పీ ద్వారా తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం చెల్లింపు వినియోగదారుల సంఖ్య 4.46 మిలియన్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 వరకు 59.19 శాతం సీఏజీఆర్‌(CAGR) వృద్ధి ఉన్నట్లు పేర్కొంది.

Physics Wallah IPO | రూ. 3,480 కోట్ల సమీకరణ కోసం.

మార్కెట్‌నుంచి రూ. 3,480 కోట్లు సమీకరించాలన్న లక్ష్యంతో ఫిజిక్స్‌వాలా కంపెనీ ఐపీవో (IPO)కు వస్తోంది. ఇందులో ఫ్రెష్‌ ఇష్యూ(Fresh issue) ద్వారా రూ. 3,100 కోట్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ. 380 కోట్లు సమీకరించనుంది. కంపెనీ కొత్త ఆఫ్‌లైన్‌ మరియు హైబ్రిడ్‌ కేంద్రాల ఏర్పాటుకు మూలధన వ్యయం కోసం, కంపెనీ నిర్వహిస్తున్న ఆఫ్‌లైన్‌ మరియు హైబ్రిడ్‌ కేంద్రాల లీజు చెల్లింపుల కోసం, Xylem యొక్క కొత్త ఆఫ్‌లైన్‌ కేంద్రాల ఏర్పాటుకు మూలధన వ్యయానికి, ఉత్కర్ష్‌ తరగతులు, ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో పెట్టుబడి, సర్వర్‌ మరియు క్లౌడ్‌ సంబంధిత మౌలిక సదుపాయాల ఖర్చులుల ఉత్కర్ష్‌ క్లాసెస్‌, ఎడ్యుటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అదనపు వాటాల సముపార్జన, సాధారణ కార్పొరేట్‌ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఆర్థిక పరిస్థితి : కంపెనీ 2023 -24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,015.35 కోట్ల ఆదాయాన్ని(Revenue) ఆర్జించగా.. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,039.09 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇదే సమయంలో నికర నష్టం(Loss) రూ. 1,131.13 కోట్లనుంచి రూ. 243.26 కోట్లకు తగ్గింది. ఆస్తులు మాత్రం రూ. 2,480.74 కోట్లనుంచి రూ. 4,156.38 కోట్లకు పెరిగాయి.

ప్రైస్‌బ్యాండ్‌ : కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 103 నుంచి రూ. 109 గా నిర్ణయించింది. ఒక లాట్‌(Lot)లో 137 షేర్లున్నాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు ఒక లాట్‌ కోసం గరిష్ట ప్రైస్‌బ్యాండ్‌ వద్ద కనీసం రూ. 14,933తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్‌ వేయవచ్చు.

కోటా, జీఎంపీ : క్యూఐబీలకు 75 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా కేటాయించారు. కంపెనీ షేర్ల జీఎంపీ(GMP) రూ. 9 గా ఉంది. అంటే లిస్టింగ్‌ రోజు 8 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు : సబ్‌స్క్రిప్షన్‌(Subscription) ఈనెల 11 న ప్రారంభమై 13న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్‌ స్టేటస్‌ 14న రాత్రి వెల్లడవుతుంది. కంపెనీ షేర్లు 18న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్టవుతాయి.