అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ed CET Schedule | తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Council of Higher Education) ఎడ్సెట్ (Ed CET ), పీఈ సెట్ (PE CET) షెడ్యూల్ విడుదల చేసింది.
బీఈడీ (BEd) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎడ్సెట్, బీపెడ్, డీపెడ్(వ్యాయామ విద్యా కోర్సులు) ప్రవేశాల కోసం పీఈ సెట్ పరీక్ష నిర్వహించారు. తాజాగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఎడ్ సెట్, పీఈ సెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల చేశారు.
ఎడ్ సెట్ నోటిఫికేషన్ ఈ నెల 14న విడుదల అవుతుంది. 21 నుంచి 31 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతారు. ఆగస్టు 4, 5 తేదీల్లో మొదటి దశ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 9న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఆగస్టు 11 నుంచి 14 లోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు http://edcetadm.tgche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలి.
Ed CET Schedule | పీఈ సెట్ షెడ్యూల్
ఈ నెల 14 పీఈ సెట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 23 నుంచి 29 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 31, ఆగస్టు 1 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. 4న సీట్ల అలాట్మెంట్ చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 5 నుంచి 8లోగా ఆయా కాలేజీల్లో జాయిన్ కావాలి. లేదంటే సీట్ రద్దు అవుతుంది. పూర్తి వివరాల కోసం వివరాల కోసం http://pecetadm.tgche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలి.