అక్షరటుడే, వెబ్డెస్క్: Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి ఈడీ అధికారులు(ED Officers) షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన కంపెనీలు, పలు సంస్థల్లో గురువారం ఉదయం దాడులు చేపట్టారు. ఏకకాలంలో 50 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. మనీలాండరింగ్ కేసు(Money Laundering Case)లో భాగంగా ఢిల్లీ, ముంబైల్లోని కంపెనీల లావాదేవీలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.
Anil Ambani | యెస్ బ్యాంక్ రుణ మోసం కేసులో..
అనిల్ అంబానీ(Anil Ambani)కి చెందిన రిలయన్స్ గ్రూప్ యెస్ బ్యాంక్ నుంచి 2017–19 మధ్య రుణం తీసుకుంది. ఈ రుణాలు తీసుకోవడంలో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసు(CBI Case) నమోదు చేసింది. దీంతో తాజాగా ఈడీ దాడులు చేపట్టింది. యెస్ బ్యాంక్ రిలయన్స్(Yes Bank Reliance) అనిల్ అంబానీ గ్రూప్ కింద ఉన్న RAAGA కంపెనీలకు సుమారు రూ. 3 వేల కోట్ల రుణాలను పంపిణీ చేసింది. అయితే ఇందులో భారీగా అక్రమాలు జరిగాయి. సరైన పత్రాలు పరిశీలించకుండానే బ్యాంక్ అధికారులు రుణాలు మంజూరు చేశారు. దీని కోసం బ్యాంక్ ప్రమోటర్లు డబ్బులు అందుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
Anil Ambani | 35 ప్రాంతాల్లో దాడులు
యెస్ బ్యాంక్ మోసం కేసులో ఈడీ అధికారులు గురువారం 35 ప్రాంతాల్లోని 50 సంస్థలపై దాడులు చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న 25 మందికి పైగా వ్యక్తులను కూడా ప్రశ్నించారు. ఎలాంటి అర్హత లేని కంపెనీలకు సరైన పత్రాలు లేకుండానే రుణం మంజురు చేశారని అధికారులు పేర్కొన్నారు. డొల్లా కంపెనీ(Dolla Company)లకు నిధులను మళ్లించారని తెలిపారు.
Anil Ambani | ఏడాదిలో రెట్టింపైన రుణాలు
గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL)లో జరిగిన అవకతవకలపై సెబీ నివేదిక సమర్పించింది. దీని ప్రకారం ఏడాదిలో సంస్థ కార్పొరేట్ రుణాలు రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742 కోట్లు ఉన్న రుణాలు 2018-19 నాటికి రూ.8,670 కోట్లకు చేరాయి. అయితే అక్రమంగా ఆయా రుణాలను సమీకరించినట్లు ఈడీ పేర్కొంది.