HomeతెలంగాణED Raids | భూదాన్ భూముల వ్యవహారంలో ముగిసిన ఈడీ సోదాలు

ED Raids | భూదాన్ భూముల వ్యవహారంలో ముగిసిన ఈడీ సోదాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: ED Raids | భూదాన్​ భూముల Bhoodan lands వ్యవహారంలో హైదరాబాద్ hyderabad​లో ఈడీ సోదాలు ed raids ముగిశాయి. సోదాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. 45 హై ఎండ్ కార్లతో పాటు రూ. 23 లక్షల నగదు, 12 వేల యూఏఈ దిర్హామ్​లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యవర్తుల ద్వారా నకిలీ పత్రాలు సృష్టించి భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఖాదర్ ఉన్నిసా అమ్మినట్లు అధికారులు గుర్తించారు. మునావర్ ఖాన్, షార్ఫన్, లతీఫ్, సుకుర్ మధ్యవర్తులుగా వ్యవహరించారు. వారి ఇళ్లలో కూడా అధికారులు దాడులు చేశారు.

ప్రభుత్వ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి..  ప్రభుత్వ భూమిని అక్రమంగా విక్రయించడంపై పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా ఈడీ తనిఖీలు చేసింది. మహేశ్వరం maheswaram  మండలం నాగారం గ్రామంలో ఉన్న భూమిని ఖాదేరునిస్సా ఆమె పూర్వీకుల ఆస్తిగా చెప్పి మోసం చేసింది. రెవెన్యూ రికార్డులను మార్చేసి, దళారులతో కలిసి భూమిని వివిధ సంస్థలకు విక్రయించారు. నిషేధిత జాబితాలో ఉన్న ఆ భూములను నకిలీ పత్రాలను సృష్టించి డి-నోటిఫై చేయించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.