అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఈ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్స్ తో బ్యాంకును మోసగించి రూ.15 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సూర్యనారాయణ రాజును ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు.
ఈ మేరకు సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు (Sai Sri Engineers Private Limited) చెందిన రూ.3.11 కోట్ల స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ కంపెనీ.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (State Bank of India) మోసం చేసినట్లు చెబుతున్నారు.
ఈ మేరకు సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు, ప్రమోటర్లపై సైతం ఈడీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ CBI, ఈఓడబ్ల్యూ EOW సైతం దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.