అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ED Raids | దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రముఖ నటులైన దుల్కర్ సల్మాన్ Dulqar Salman, పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), అమిత్ చకల్‌కల్ ఇళ్లలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాడులు జరిపింది.
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు (luxury car smuggling Case) నేపథ్యంలో వీరి నివాసాల్లో అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కీలకమైన ఆర్థిక లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
ED Raids | చిక్కుల్లో మలయాళ స్టార్స్..
భూటాన్ ఆర్మీకి చెందిన ఖరీదైన వాహనాల వ్యవహారంలో ఈ దాడులు జరిపినట్టు సమాచారం. భూటాన్ (Bhutan) సైన్యం తన వాహనశ్రేణిలోని కొన్ని లగ్జరీ కార్లను ఉపసంహరించుకున్న తర్వాత, వాటిని వేలంలో భాగంగా చాలా తక్కువ ధరలకు కొందరు వ్యక్తులు సొంతం చేసుకున్నారు. అనంతరం వీటిని భారతదేశానికి తరలిస్తూ ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా స్మగ్లింగ్ చేశారని ఈడీ అనుమానిస్తోంది. ఈ కార్లను కొంతమంది ప్రముఖులకు విక్రయించినట్లు గుర్తించిన ఈడీ, దర్యాప్తును ఆ దిశగా విస్తరించింది.
ఇందులో భాగంగానే మలయాళ సూపర్స్టార్లు (Malayalam superstars) దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ నివాసాల్లో సోదాలు జరిగాయి. వీరు నేరుగా కార్ల స్మగ్లింగ్‌లో పాలుపంచుకున్నారా, లేక తెలియక బోగస్ వాహనాలను కొనుగోలు చేశారా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఇక ఈ వ్యవహారంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు దుల్కర్ లేదా పృథ్వీరాజ్ తరఫున ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అయితే లగ్జరీ కార్ల (Luxury cars) స్మగ్లింగ్ వ్యవహారం సినీ పరిశ్రమను టచ్ చేయడంతో ఈ కేసు మరింత రాజకీయ, సామాజిక చర్చలకు దారితీసే అవకాశముంది. మొత్తం మీద, ఈడీ దృష్టిలోకి వచ్చిన ఈ కేసుపై దశలవారీగా మరింత విచారణ సాగే అవకాశం ఉంది.. మరికొందరు ప్రముఖులు కూడా ఈ లిస్ట్‌లో చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.