అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సౌరజ్ భరద్వాజ్ నివాసంతో పాటు పలుచోట్ల ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) మంగళవారం దాడి చేసింది. ఢిల్లీలోని 12 చోట్ల తనిఖీలు చేపట్టింది.
గత పాలనలో ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆసుపత్రుల నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. అయితే, ఈడీ దాడులను ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఖండించారు. ఇది రాజకీయ కక్షలో భాగంగానే ఈడీ దాడులని, బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
Arvind Kejriwal | భారీ అవినీతి..
ఆప్ ప్రభుత్వం(AAP Government) 2018-19లో ఢిల్లీ ప్రభుత్వం 24 ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.5,590 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆమోదించింది. ఐసీయూలతో సహా ఈ ఆసుపత్రులను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. కానీ మూడు సంవత్సరాలు దాటినా కూడా పని పూర్తి కాలేదు. ఈ క్రమంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. రూ.800 కోట్లు ఖర్చు చేసినప్పటికీ, 50 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయి. LNJP హాస్పిటల్ కు సంబంధించి పనుల్లో పురోగతి లేకుండానే ఖర్చు రూ.488 కోట్ల నుంచి రూ.1,135 కోట్లకు పెరిగింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఈడీ.. మాజీ ఆరోగ్య మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్ లను ప్రశ్నించింది.
Arvind Kejriwal | ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్న బీజేపీ
ఈడీ దాడులను(ED Raids) ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. మోదీ ప్రభుత్వ తప్పుడు విధానాలు, అవినీతి చర్యలకు వ్యతిరేకంగా ఆప్ తీవ్రంగా పోరాడినందుకే లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వం(Modi Government) ఏజెన్సీలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. “సౌరభ్ భరద్వాజ్(Saurabh Bharadwaj) ఇంట్లో జరిగిన ఈడీ దాడి మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ద సంస్థలను దుర్వినియోగం చేస్తోందనడానికి మరో ఉదాహరణ. మోదీ ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party)ని వెంటాడుతోంది. “ఆప్” ను లక్ష్యంగా చేసుకున్నట్లు చరిత్రలో ఏ పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదు” అని ఆయన X లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు,