HomeUncategorizedAllu Aravind | బ్యాంక్​ స్కామ్​ కేసులో నిర్మాత అల్లు అరవింద్​ను విచారించిన ఈడీ

Allu Aravind | బ్యాంక్​ స్కామ్​ కేసులో నిర్మాత అల్లు అరవింద్​ను విచారించిన ఈడీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Allu Aravind | ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్​ను ఈడీ అధికారులు(ED Officers) శుక్రవారం విచారించారు. గతంలో జరిగిన ఓ బ్యాంక్​ స్కామ్​ కేసులో ఆయనను ప్రశ్నించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్(Ramakrishna Electronics Bank Scam)​లో అల్లు అరవింద్​ను ఈడీ అధికారులు విచారించారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలు వంటి అంశాలపై ఆయనను ప్రశ్నించారు.

Allu Aravind | ఆ స్కామ్​తో సంబంధం ఉందా అని..

యూనియన్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా నుంచి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ అనే సంస్థలు రూ.101 కోట్ల రుణం తీసుకొని ఎగవేశాయి. ఈ స్కామ్ 2017-19లో జరిగింది. ఈ కేసులో అల్లు అరవింద్‌(Allu Aravind)కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు ఆయనకు ఇదివరకే నోటీసులు ఇవ్వగా శుక్రవారం విచారణకు హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు ఈడీ అధికారులు నిర్మాత అల్లు అరవింద్​ను విచారించారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని ఆయనను ఈడీ ఆదేశించింది.

Allu Aravind | అసలు ఈ స్కాం ఏమిటి?

హైదరాబాద్ ​(Hyderabad)కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ సంస్థలకు సంబంధించిన కుంభకోణాన్ని రామకృష్ణ ఎలక్ట్రానిక్స్​ స్కామ్​ అంటారు. ఈ రెండు సంస్థలు గతంలో యూనియన్​ బ్యాంకు ఆఫ్​ ఇండియా (Union Bank of India) నుంచి రూ.101 కోట్ల రుణాలు తీసుకున్నాయి. అనంతరం ఆ రుణాలను చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డాయి. దీంతో బ్యాంకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది.

సదరు సంస్థలు బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసినట్లు ఈడీ గుర్తించింది. ఆ డబ్బులను సొంత అవసరాల కోసం దారి మళ్లించినట్లు తేల్చింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అయితే సదరు కంపెనీలతో నిర్మాత అల్లు అరవింద్​కు గతంలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో ఆయనను విచారించింది.