ePaper
More
    HomeజాతీయంED Raids | వాల్మీకి స్కామ్​లో ఈడీ దూకుడు.. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

    ED Raids | వాల్మీకి స్కామ్​లో ఈడీ దూకుడు.. ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు

    Published on

    అక్షరటుడే వెబ్​డెస్క్​: ED Raids | కర్ణాకటలో జరిగిన వాల్మీకి కుంభకోణం(Valmiki Scam) దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. వాల్మీకి కుంభకోణంతో సంబంధం ఉన్న బళ్లారి కాంగ్రెస్​ ఎంపీ తుకారాం(Ballary Congress MP Tukaram)తోపాటు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల ఇళ్లపై బుధవారం దాడులు చేసింది.

    ED Raids | మూడు ప్రాంతాల్లో తనిఖీలు

    కర్ణాటకలో జరిగిన స్కామ్​లలో వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం పెద్దది. గిరిజనుల సంక్షేమానికి ఉపయోగించాల్సిన వాల్మీకి కార్పొరేషన్​ నిధులను కొందరు దారి మళ్లించారు. తెలంగాణ(Telangana), ఏపీ(Andhra Pradesh)లోని 18 వేర్వేరు నకిలీ ఖాతాల్లో రూ.89.62 కోట్లు జమ చేసినట్లు ఈడీ ఆరోపించింది. ఈ స్కామ్​లో మనీలాండరింగ్​(Money laundering) జరిగినట్లు ఈడీ పేర్కొంది. ఈ మేరకు మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) నిబంధనల కింద బళ్లారిలోని ఐదు చోట్ల, బెంగళూరులోని మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎంపీ తుకారాంతో పాటు, కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి(బళ్లారి నగరం), జె.ఎన్. గణేష్(కాంప్లి), ఎన్.టి.శ్రీనివాస్(కుడ్లిగి)లకు చెందిన ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...