ED Raids
ED Raids | గొర్రెల పంపిణీ స్కామ్​లో ఈడీ దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: ED Raids | గొర్రెల పంపిణీ స్కామ్​లో ఈడీ దూకుడు పెంచింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. బీఆర్​ఎస్ (BRS)​ హయాంలో గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. యూనిట్​ ధరలో 25 శాతం లబ్ధిదారులు భరిస్తే 75 శాతం ప్రభుత్వం చెల్లించింది. ఇందులో భాగంగా మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,93,223 మందికి గొర్రెలు పంపిణీ చేశారు. ఒక యూనిట్​లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉంటుంది. రెండో విడతలో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ కొంత మందికి మాత్రమే గొర్రెలు అందించారు. అయితే గొర్రెల పంపిణీలో (Sheep Distribution) భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి.

ED Raids | ఏసీబీ కేసు నమోదు

గొర్రెల పంపిణీ పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. కొంతమంది లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండానే డబ్బులు అందించారు. అంతేగాకుండా అవే గొర్రెలను పలువురు లబ్ధిదారులకు అందించినట్లు చూపించి భారీ మొత్తంలో లబ్ధిదారుల నుంచి వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ పథకంలో సుమారు రూ.750 కోట్లు కుంభకోణం జరిగినట్లు గతంలో ఏసీబీ కేసు నమోదు (ACB Registers Case) చేసింది. పలువురు నిందితులను కూడా అరెస్ట్​ చేసింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మొయినుద్దీన్‌, ఇక్రముద్దీన్‌ పరారీలో ఉన్నారు.

ED Raids | 8 చోట్ల సోదాలు

ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ అధికారులు ఎన్​ఫోర్స్​మెంట్​ కేసు (Enforcement Case) ఇన్ఫరేషన్​ రిపోర్టు తయారు చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఏకకాలంలో 8 ప్రాంతాల్లో సోదాలు చేపడుతున్నారు. లోలోనా పేరుతో ప్రభుత్వ స్కీమన్​ను మొయినుద్దీన్‌ స్కామ్​గా (Moinuddin Scam) మార్చాడు. మొయినుద్దీన్‌కు చెందిన లోలోనా కార్యాలయాల్లో ఈడీ సోదాలు(ED Raids) చేపడుతోంది. మొయినుద్దీన్‌, ఇక్రముద్దీన్‌ నివాసాల్లో సైతం అధికారులు దాడులు చేశారు. ఈ స్కామ్​లో ఇప్పటికే పలువురు పశు సంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్ట్​ చేసింది. ఆ శాఖ మాజీ డైరెక్టర్‌ రామచంద్రనాయక్(Former Director Ramachandra Nayak) ఇంట్లో తాజాగా ఈడీ సోదాలు చేపట్టింది. మాజీ మంత్రి ఓఎస్డీ కల్యాణ్‌(Former Minister OSD Kalyan) నివాసాల్లో సోదాలు సైతం తనిఖీలు చేపట్టింది.