HomeUncategorizedElection Commission | రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

Election Commission | రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Election Commission | కాంగ్రెస్​ నాయకుడు, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్​ ఫిక్సింగ్ (BJP match fixing) చేసిందని, రిగ్గింగ్​కు పాల్పడి గెలిచిందని రాహుల్​ గాంధీ ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

ఎన్నికల కమిషనర్ల నియామకం ప్యానల్​ను తారుమారు చేయడం, దొంగ ఓట్లను చేర్చడం, ఓటింగ్​ శాతాన్ని కృత్రిమంగా పెంచడం ద్వారా బీజేపీ (BJP) గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. బీహార్​లో కూడా ఇలాగే చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

కాగా.. రాహుల్​ గాంధీ వ్యాఖ్యలపై ఈసీ (Election Commission of India) తీవ్రంగా స్పందించింది. మహారాష్ట్ర ఎన్నికలపై (Maharashtra elections) రాహుల్‌ ఆరోపణలు నిరాధారం అని కొట్టిపారేసింది. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా రాహుల్​ గాంధీ మాట్లాడారని పేర్కొంది. ఇలాంటి ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది.