ePaper
More
    HomeతెలంగాణEatala Rajendar | కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ముగిసిన ఈటల విచారణ

    Eatala Rajendar | కాళేశ్వరం కమిషన్‌ ఎదుట ముగిసిన ఈటల విచారణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Eatala Rajendar | కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)​ ఎదుట ఎంపీ ఈటల రాజేందర్​ విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు, అవినీతి నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం జస్టిస్​ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghosh Commission)​ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్​ ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​(KCR)తో పాటు మాజీ మంత్రులు ఈటల రాజేందర్​, హరీశ్​రావు(Harish Rao)కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం ఈటల రాజేందర్​ బీఆర్​కే భవన్​లో కాళేశ్వరం కమిషన్​ విచారణకు హాజరయ్యారు.

    Eatala Rajendar | సొంత నిర్ణయాలు తీసుకోలేదు

    కాళేశ్వరం కమిషన్​ సుమారు గంట పాటు ఈటల రాజేందర్(Etala Rajender)​ను విచారించింది. ప్రాజెక్ట్​ నిర్మాణ సమయంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండడంతో ప్రాజెక్ట్ ఆర్థిక లావాదేవీలపై కమిషన్ ప్రశ్నించింది. ఈ క్రమంలో కమిషన్‌కు పలు డాక్యుమెంట్లు ఆయన అందజేసినట్లు సమాచారం.

    గత ప్రభుత్వ ఆదేశాలతోనే నిధులు విడుదల చేసినట్లు ఈటల స్పష్టం చేసినట్లు తెలిసింది. తాను సొంత నిర్ణయాలు తీసుకోలేదని కమిషన్​కు తెలిపారు. కేబినెట్ నిర్ణయాల మేరకే నిధులు ఇచ్చామని పేర్కొన్నారని సమాచారం. సాంకేతిక అంశాల గురించి తనకు తెలియదన్నారు.

    Eatala Rajendar | అందుకే మార్చాం..

    కేంద్ర జల సంఘం, మహారాష్ట్ర అభ్యంతరాలతో ప్రాజెక్టును తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ(Medigadda)కు మార్చినట్లు ఈటల పేర్కొన్నారు. బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలు ఎందుకు మార్చారని కమిషన్​ ప్రశ్నించగా.. సాంకేతిక అంశాలపై తమకు అవగాహన ఉండదని, టెక్నికల్‌ పర్సన్స్‌ చూసుకుంటారని చెప్పినట్లు సమాచారం. కాళేశ్వరం మొదట రూ.63 వేల కోట్లతో నిర్మించాలని నిర్ణయించినట్లు ఈటల తెలిపారు. అయితే తర్వాత అది రూ.83 వేల కోట్లకు పెరిగిందని, ఇప్పుడు ఎంత ఖర్చైందో తనకు తెలియదని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.

    కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)​ ఎదుట ఈ నెల 7న హరీశ్​రావు, 11న కేసీఆర్​ విచారణకు హాజరు కానున్నారు. వీరి విచారణ పూర్తయిన తర్వాత కమిషన్​ తన తుది నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నెలాఖరులోగా కమిషన్​ నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.

    More like this

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్​లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్ పుస్తకాలు,...