అక్షరటుడే, ఆర్మూర్: Bhubarathi | భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. మండలంలోని సుర్బిర్యాల్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సుకు (Revenue Conference) ఆయన హాజరై మాట్లాడారు. భూములు ఉండి పట్టాలు లేకపోవడం, కొలతలకు భూములు లేక ఏళ్లుగా రైతులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ (Armoor Market Committee) సాయి బాబాగౌడ్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ పండిత్ పవన్, నాయకులు గిరి, నవీన్ రెడ్డి, లవన్, డిప్యూటీ తహశీల్దార్ సుజాత, అధికారులు పాల్గొన్నారు.
