అక్షరటుడే, వెబ్‌డెస్క్: Earthquake strikes Afghanistan : ఆఫ్ఘానిస్థాన్‌ను వరుస భూకంపాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం ఈ దేశంలో భారీ భూకంపం సంభవించింది. సుమారు 1,400 మంది మరణించారు. 3,500 మందిపైగా గాయాలపాలయ్యారు.
ఈ భూకంప ధాటికి భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రకృతి ప్రకోపానికి గురైన ఆఫ్ఘాన్‌లో ఓ వైపు సహయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ విపత్తు నుంచి కోలుకోకముందే ఆఫ్ఘానిస్థాన్‌ను మరో భూకంపం కుదిపేసింది.
తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో మంగళవారం (సెప్టెంబరు 2) భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.2 గా నమోదైంది. ఈమేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
US Geological Survey నివేదిక ప్రకారం.. Afghanistan లోని నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్‌కు ఈశాన్యంగా 34 కిలోమీటర్ల (21 మైళ్ళు) దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
Earthquake strikes Afghanistan : ఆ కేంద్రానికి సమీపంలోనే..
1,400 మందిని బలిగొన్న భూకంప కేంద్రానికి సమీపంలోనే తాజా భూకంప కేంద్రం ఉండటం గమనార్హం. భూమి మళ్లీ కంపించడంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు.
తాలిబన్ ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టింది. తాజా భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా తెలియరాలేదు.
పాక్ – ఆఫ్ఘాన్ సరిహద్దుకు సమీపంలోని పర్వత ప్రాంతాలలో ఆదివారం (ఆగస్టు 31) అర్ధరాత్రి 6.0 తీవ్రతతో భారీ భూకంపం ఏర్పడిన విషయం తెలిసిందే. ఐదు చోట్ల వరుసగా భూమి కంపించింది.