HomeUncategorizedEarthquake | టర్కీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Earthquake | టర్కీలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Earthquake | టర్కీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మర్మారిస్(Murmaris) సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. దక్షిణ గ్రీస్, పశ్చిమ టర్కీ సమీపంలోని ఏజియన్ సముద్ర తీర ప్రాంతాలలో ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. ప్రాణ, ఆస్తి నష్టంపై టర్కీ ప్రభుత్వం(Turkish Government) ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ భూకంపం దాటికి గ్రీక్ దీవితో సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో భయపడిన జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake | భూకంపాలు సాధారణం

టర్కీ(Turkey)లో ఎక్కువ మొత్తంలో భూకంపాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అక్కడ 2023లో 7.8 తీవ్రత చోటు చేసుకున్న భూకంపం దాటికి 53 వేల మంది మరణించారు. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఆ సమయంలో టర్కీకి భారత్(India)​ అండగా నిలిచింది. సహాయక బృందాలను, అత్యవసర సామగ్రిని ప్రత్యేక విమానంలో పంపింది. అయితే టర్కీ మాత్రం అవకాశం వచ్చిన ప్రతీసారి భారత్​కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇటీవల పహల్గామ్​ ఉగ్రదాడి, ఆపరేషన్​ సిందూర్(Operation Sindoor)​ సమయంలో కూడా టర్కీ పాక్​(Pakistan)కు మద్దతు తెలిపింది. గతంతో భారత్​ చేసిన సాయాన్ని మరిచి ఉగ్రదాడికి సపోర్ట్​ చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు.

Earthquake | బాయ్​కాట్​ టర్కీ పేరిట ప్రచారం

ఆపరేషన్​ సిందూర్​ సమయంలో టర్కీ పాక్​కు మద్దతు తెలపడంతో భారత్​లో బాయ్​కాట్ టర్కీ(Boycott Turkey) క్యాంపెయిన్​ నిర్వహించారు. ఇందులో భాగంగా టర్కీ వస్తువులను బ్యాన్​ చేశారు. పూణేలోని వ్యాపారులు టర్కీ యాపిల్స్​ దిగుమతిని ఆపేశారు. అలాగే టర్కీ నుంచి వచ్చే ఇతర దిగుమతులను సైతం వ్యాపారులు స్వచ్ఛందంగా బాయ్​కాట్ చేశారు.