అక్షరటుడే, వెబ్‌డెస్క్: Earthquake : పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ రెడ్ జోన్లో ఉన్న ఇండోనేసియా దీవులను మరోమారు భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం.. సాయంత్రం 6:21 గంటలకు గోరంటాలో రీజెన్సీకి 165 కిలో మీటర్ల దూరంలో 108.4 కిలోమీటర్ల లోతులో భూకంపం ఏర్పడింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే US Geological Survey ప్రకటించింది. ఈ భూకంప ప్రభావం ఇండోనేసియా, ఫిలిప్పిన్స్, మలేసియా దేశాలపై పడింది.