Homeఅంతర్జాతీయంPhilippines earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు.. సునామీ...

Philippines earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్​ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ!

Philippines earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ దేశంలోని మిండానావో ద్వీపంలో ప్రకృతి విలయం అతలాకుతలం చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Philippines earthquake | ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ దేశంలోని మిండానావో ద్వీపంలో ప్రకృతి విలయం అతలాకుతలం చేసింది.

శుక్రవారం (అక్టోబరు 10, 2025) (స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:43 గంటలకు) 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత దృష్ట్యా స్థానిక ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

భారీ భూకంపం వల్ల మిండానావో ద్వీపం చాలా వరకు దెబ్బతింది. భవనాలు బీటలు వారాయి.