అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | మండల కేంద్రంలోని నారాయణగిరి కొండపై కొలువైన శివభక్త మార్కండేయ ఆలయంలో (Shiva Bhakta Markandeya temple) చోరీ జరిగిందని ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) పేర్కొన్నారు.
పోలీసులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్కండేయ ఆలయ ఆవరణలోని వరండాలో 20 రోజుల క్రితం పెట్టిన హుండీని గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పగులగొట్టాడు. హుండీలో నగదు చోరీకి గురైందనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అంతేకాకుండా ఆలయంలో చోరీ చేసిన గుర్తు తెలియని వ్యక్తి మండల కేంద్రానికి చెందిన ఒక బైక్ను కూడా దొంగతనం చేశాడని ఎస్సై తెలిపారు.