అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Eagle Team | ముంబైలో తెలంగాణ (Telangana) ఈగల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. డెకాయి ఆపరేషన్ (Decoy operation) నిర్వహించి డ్రగ్స్, హవాలా నెట్‌వర్క్‌ను ఛేదించారు.
ముంబై పోలీసులు (Mumbai Police) ఇటీవల తెలంగాణలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి రూ.12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణ ఈగల్ టీమ్ పోలీసులు ముంబైలో డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. ఫార్మా కంపెనీల ద్వారా డ్రగ్స్ తయారీ, హవాలా ద్వారా ఇతర దేశాలకు డబ్బులను తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. వారం రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి 24 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
Eagle Team | నైజీరియన్ ఇచ్చిన వివరాలతో..
హైదరాబాద్ (Hyderabad)లో నైజీరియన్లు భారీగా నివసిస్తున్నారు. వీరిలో చాలామంది సైబర్ క్రైమ్, డ్రగ్స్ దందాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇటీవల ఈగల్ టీమ్ పోలీసులు ఓ నైజీరియన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన వివరాల ఆధారంగా ముంబైలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా డ్రగ్స్ విక్రయించి, నైజీరియాకు హవాలా ద్వారా డబ్బులు పంపుతున్న గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. మొత్తం 24 మందిని అదుపులోకి తీసుకోగా.. ఇందులో ముంబైకి చెందిన 14 మంది వ్యాపారులు ఉండటం గమనార్హం.
డ్రగ్స్ కేసులో భాగంగా పూణేలోని మూడు డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమలను గతంలోనే పోలీసులు సీజ్ చేశారు. అయితే డ్రగ్స్ ఎవరెవరికి విక్రయించారని ఆరా తీస్తున్నారు. అలాగే హవాలా ద్వారా ఎంత మొత్తం నగదు తరలించారనే అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.