ePaper
More
    HomeతెలంగాణEagle Team | గంజాయ్​ బ్యాచ్​కు చుక్కలు చూపిస్తున్న ఈగల్​ టీమ్​

    Eagle Team | గంజాయ్​ బ్యాచ్​కు చుక్కలు చూపిస్తున్న ఈగల్​ టీమ్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Eagle Team | రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగింది. గత పదేళ్లలో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం గంజాయి విక్రయాలు పెరిగాయి. గతంలో పెద్ద పెద్ద నగరాలకే పరిమితమైన గంజాయి, డ్రగ్స్​ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలకు విస్తరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

    ఎంతోమంది యువత వీటికి బానిసలుగా మారి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చడానికి చర్యలు చేపడుతామని ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించిన విషయం తెలిసిందే.

    ఈ మేరకు ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్​ ఆట కట్టించడానికి ఈగల్​ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ గద్ద(ఈగల్​) వాలిపోతుందని గతంలో సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఇటీవల ఈగల్​ టీం పోలీసులు (Eagle Team police) హైదరాబాద్​ నగరంలో దాడులు చేపడుతున్నారు. గంజాయి, డ్రగ్స్​ విక్రేతలు, కొనేవారికి చుక్కలు చూపిస్తున్నారు.

    Eagle Team | గంజాయి కొనుగోలుకు కోడ్​ భాష

    ఈగల్​ టీం ఇటీవల కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్​పై (Malnadu restaurant) దాడి చేసి, పెద్ద డ్రగ్స్​ రాకెట్​ గుట్టు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ రెస్టారెంట్ యజమాని సూర్య పలువురు పబ్​ యజమానులతో కలిసి డ్రగ్స్​ దందా చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. తాజాగా ఈగల్​ టీం 2 గంటల వ్యవధిలో డెకాయ్​ ఆపరేషన్​ నిర్వహించి 14 మంది గంజాయి వినియోగదారులను పట్టుకుంది. అయితే వీరు గంజాయి విక్రయించడానికి ‘‘బాయి బచ్చ ఆ గయా బాయి’’ అనే కోడ్ భాషను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

    Eagle Team | ఐటీ కారిడార్​లో ఆపరేషన్​

    హైదరాబాద్​లోని ఐటీ కారిడార్​ అయిన గచ్చిబౌలిలో ఈగల్​ టీం అధికారులు ఆదివారం డెకాయ్​ ఆపరేషన్​ (decoy operation) నిర్వహించారు. ఇటీవల గంజాయి విక్రేతను అరెస్ చేసిన పోలీసులు.. అతని ఫోన్​ నుంచి ‘‘బాయి బచ్చ ఆ గయా బాయి’’ అని మేసేజ్​ పంపారు. దీంతో గంజాయి కొనుగోలు చేయడానికి 14 మంది వచ్చారు.

    గచ్చిబౌలి హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు సమీపంలో నిర్వహించిన ఈ ఆపరేషన్​లో 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారు ఉండటం గమనార్హం. వీరిలో నలుగురు ఐటీ ఉద్యోగులు, ఒక విద్యార్థి, ఒక ట్రావెల్ ఏజెన్సీ యజమాని కూడా ఉన్నారు. వారికి పరీక్ష నిర్వహించగా గంజాయి తీసుకున్నట్లు తేలింది.

    Eagle Team | గంజాయి కోసం నాలుగేళ్ల బిడ్డతో..

    ఓ జంట తమ నాలుగేళ్ల బిడ్డతో కలిసి గంజాయి కొనడానికి వచ్చారు. వారిని చూసి ఈగల్​ టీం సభ్యులే షాక్​ అయ్యారు. మరో ఇద్దరు దంపతులు సైతం గంజాయి కొనడానికి రాగా.. అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి పరీక్షలు చేయగా గంజాయి తీసుకున్నట్లు తేలింది. కాగా.. ప్రధాన నిందితుడు, మహారాష్ట్రకు చెందిన వ్యాపారి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడు వంద మందికి పైగా కస్టమర్లకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...