అక్షరటుడే, వెబ్డెస్క్ : Eagle Team | డ్రగ్స్ దందా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ టీమ్ చర్యలు చేపడుతోంది. ఇటీవల డ్రగ్స్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఆదివారం స్పెషల్ ఆపరేషన్(Special Operation) చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేపట్టింది.
డ్రగ్స్ దందాపై ఈగల్ టీమ్(Eagle Team) ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ తయారీ, విక్రయాలపై దాడులు చేపట్టి ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది. ముంబై, పూణేలో సైతం స్పెషల్ ఆపరేషన్ను చేపట్టి హవాలా నెట్వర్క్ను ఛేదించింది. అంతేగాకుండా డెకాయి ఆపరేషన్లు(Decoy Operations) నిర్వహించి మత్తుపదార్థాలకు బానిసలుగా మారిన వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ సైతం ఇస్తోంది. తాజాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈగల్ టీమ్ స్థానిక పోలీసుల సాయంతో దాడులు చేపట్టింది.
Eagle Team | రైల్వే స్టేషన్లలో..
ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, L&O పోలీసులు ఆదివారం సంయుక్త దాడులు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)లో నలుగురు డ్రగ్ పెడ్లర్ల అరెస్టు చేశారు. వారి నుంచి 91 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రైలులో గంజాయి తరలిస్తున్న మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద 5 కేజీల గంజాయి పట్టుకున్నారు. వరంగల్‌లో కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు(Konark Express Train)లో ముగ్గురిని అదుపులోకి తీసుకొని 32 కేజీల గంజాయి పట్టుకున్నారు.
Eagle Team | అల్ప్రాజోలం పట్టివేత
ములుగు జిల్లా(Mulugu District) వాజేడులో పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి రూ. 7.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వరంగల్ ఐనవోలు పరిధిలో ఓ ఫెడ్లర్ను అరెస్టు చేసి రూ.53.5 లక్షల విలువైన 214 కిలోల గంజాయి పట్టుకున్నారు. సంగారెడ్డిలో అల్ప్రాజోలం తయారీ కేంద్రంలో దాడులు చేపట్టారు. 270 గ్రాముల అల్ప్రాజోలం(270 Grams Alprazolam), 7.890 కేజీల నోర్డయాజిపామ్ స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈగల్ టీమ్, పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి.