HomeUncategorizedDuvvada Srinivas | మొన్న డ్యాన్స్‌తో ఇప్పుడు యాడ్‌తో.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ర‌చ్చ‌

Duvvada Srinivas | మొన్న డ్యాన్స్‌తో ఇప్పుడు యాడ్‌తో.. దువ్వాడ శ్రీనివాస్, మాధురి ర‌చ్చ‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Duvvada Srinivas | దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), దివ్వెల మాధురి తెలుగు రాష్ట్రాలలో క్రేజీ సెల‌బ్రిటీ జంట‌గా మారారు. ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి(Divvela Madhuri)తో పెట్టుకున్న ఎఫైర్, ఆపైన దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ భార్య మధ్య జరిగిన రచ్చ తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. వీరిద్దరి ప్రేమ కథకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే వీరేంత ఫేమస్స‌య్యారో తెలుస్తుంది. వీరిద్దరూ కలిసి ఇచ్చే ఇంటర్వ్యూలు అయితే చాలా పాపులర్ కూడా అయ్యాయి. ఇక ఇటీవ‌ల దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి ఫంక్షన్ హైదరాబాద్‌(Hyderabad)లో అట్టహాసంగా జరిగింది.

Duvvada Srinivas | ఇప్పుడు యాడ్‌తో..

హైదరాబాద్​లో జరిగిన తమ ఫ్యామిలీ ఫంక్షన్​లో అదిరిపోయే స్టెప్పులతో రచ్చ లేపారు శ్రీనివాస్, మాధురి. కలర్​ఫుల్​ బ్యాక్​గ్రౌండ్​లో, భారీ డెకరేషన్​తో ఏర్పాటు చేసిన పెద్ద స్టేజి మీద, కాస్ట్లీ కాస్ట్యూమ్​తో అదరగొట్టారు. వారి ప్రేమకథకు తగ్గట్టే సాంగ్ తమకు సూట్ అయ్యే ఒక సాంగ్​ను సెలెక్ట్ చేసుకొని, దానికి తగినట్టు స్టెప్పులు వేసి దివ్వెల మాధురి యూట్యూబ్ ఛానల్​లో ఆ వీడియోను పోస్ట్ చేశారు. ఇక ఆ సాంగ్ కూడా వారిద్దరి ప్రేమ కథకు తగ్గట్టుగానే ఉండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరి మధ్య అద్భుతమైన సమన్వయం, ప్రదర్శనలో కనబరిచిన ఉత్సాహం బాగుంద‌ని పలువురు కామెంట్లలో పేర్కొన్నారు.

ఇక తాజాగా ఈ జంట క‌ల‌ర్‌ఫుల్ యాడ్ చేశారు. చీర‌ల‌ను ప్ర‌మోట్ చేసే క్ర‌మంలో ఈ ఇద్ద‌రు చేసిన యాడ్ నెట్టింట వైరల్​గా మారింది. ముందు మాధురి కాఫీ తీసుకొని ఇచ్చి శ్రీనివాస్‌కు ఇస్తే బాగుంద‌ని అంటాడు. కాఫీనా అంటే కాదు నీ చీర అంటాడు. ఆ త‌ర్వాత హార‌తి తీసుకోవ‌డానికి శ్రీనివాస్‌ని పిలుస్తుంది మాధురి. అప్పుడు సూప‌ర్ అంటాడు. పూజ‌నా అంటే కాదు నీ చీర అంటాడు. ఇక ఆ త‌ర్వాత శ్రీనివాస్‌ని భోజ‌నానికి పిలిస్తే కొంచెం తిని, సింప్లీ సూప‌ర్ అంటాడు. ఏంటి నా వంట‌నా అంటే కాదు నీ చీర అని చెబుతాడు. నువ్వు ఉద‌యం నుండి క‌ట్టుకున్న చీర‌ల‌న్నీ Sarees చాలా అందంగా ఉన్నాయి. ఎక్క‌డ తీసుకున్నావ్ అని అడిగితే అప్పుడు షాప్ పేరు చెబుతుంది. ఇలా యాడ్(Add) కోసం ఇద్ద‌రు తెగ ర‌చ్చ చేశారు. దీనిపై తెగ ట్రోలింగ్ కూడా న‌డుస్తోంది.