అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Duvvada Madhuri | తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ చర్చల్లో ఉండే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట మరోసారి వివాదంలో చిక్కుకుంది. బిగ్‌బాస్ 9 ద్వారా మాధురి తన పాపులారిటీని పెంచుకున్న తర్వాత, ఈ జంట చేసే ప్రతి పని మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజాగా మాధురి బర్త్‌డే పార్టీ సందర్భంగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకోవడంతో సంచలనం రేపింది. డిసెంబర్ 12న దివ్వెల మాధురి పుట్టిన రోజు కావడంతో, దువ్వాడ శ్రీనివాస్ మొయినాబాద్‌లోని ‘ది పెండెంట్ ఫామ్‌హౌస్’లో (The Pendant Farmhouse) గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే ఈ పార్టీకి ఎలాంటి అధికారిక అనుమతి లేదని, అంతేకాకుండా మద్యం మరియు మత్తు పదార్థాలు ఉన్నాయన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు (SOT Police) ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు. అక్కడి నుంచి 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఏడు హుక్కా సెట్లు స్వాధీనం చేసినట్లు తెలుస్తోంది.
Duvvada Madhuri | అనుమతి లేకుండా..
ఈ దాడిలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) శాసన మండలిలో సభ్యుడిగా పనిచేస్తున్నారు. గతేడాది ఆయన తన కుటుంబాన్ని విడిచి దివ్వెల మాధురితో కలిసి ఉండడం వివాదాస్పదంగా మారింది. టెక్కలిలోని ఆయన నివాసం వద్ద భార్యా పిల్లలు ధర్నా చేసిన తర్వాత ఈ జంట సంబంధం బహిరంగమైంది. అప్పటి నుంచి ఇద్దరూ కార్యక్రమాలు, ఫంక్షన్లకు కలిసి హాజరవుతూ ఓపెన్‌గా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఇటీవల బిగ్‌బాస్ 9 (Bigg Boss 9) షోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా వచ్చిన దివ్వెల మాధురి మూడు వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. మొదటి వారం ఎవరూ ఆమెను నామినేట్ చేయకపోయినా, రెండో వారం తనూజతో డైరెక్ట్ నామినేషన్‌కు గురై ఎలిమినేట్ అయింది.
హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయ్యాయి. తాజాగా జరిగిన బర్త్‌డే పార్టీ ఘటనతో మళ్లీ ఈ జంట చర్చలోకి రావడం ఖాయం అయ్యింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు. మరి దీనిపై దువ్వాడ మాధురి లేదంటే శ్రీనివాస్ (Duvvada Srinivas) స్పందిస్తారా అనేది చూడాలి.