అక్షరటుడే, నిజామబాద్ సిటీ : CP Sai Chaitanya | దుర్గామాత మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) సూచించారు. శుక్రవారం అర్ధరాత్రి ఆయన నగరంలోని పలు మండపాలను పరిశీలించారు.
సీపీ మండపాల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్ బుక్‌లను తనిఖీ చేశారు. ఆ బుక్కులలో నమోదు చేసిన నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు. నిర్వాహకులు భక్తుల (devotees) విషయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మండపం దగ్గర ఎప్పుడు ఇద్దరు, ముగ్గురు మండలి సభ్యులు ఉండాలన్నారు. డీజేలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. వర్షాలు పడుతుండటంతో మండపాల వద్ద విద్యుత్‌తో జాగ్రత్తగా ఉండాలన్నారు. రాత్రి పది గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయాలన్నారు.