అక్షరటుడే, బోధన్ : Bodhan | నవరాత్రులు పూజలందుకున్న దుర్గామాత నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ పట్టణంలో సార్వజనిక్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర జరిగింది. సబ్ కలెక్టర్ వికాస్ మహతో(Sub-Collector Vikas Mahato) యాత్రను ప్రారంభించారు.
Bodhan | నృత్యాలతో సందడి..
యాత్రలో భాగంగా మహిళలు, యువకులు, చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారి ముందు నడిచారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శోభాయాత్ర ఆసాంతం పోలీసులు నిఘా నీడలో కొనసాగింది. ఏసీపీ శ్రీనివాస్ (ACP Srinivas), సీఐ వెంకట్ నారాయణ (CI Venkat Narayana), వంద మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు శోభాయాత్రను పోలీసులు పర్యవేక్షించారు.