అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాల్లోనూ మహిళలకు సముచిత న్యాయం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలో రూ.19 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో (SDF Funds) నూతనంగా నిర్మించిన మహిళా మండలి భవనాన్నిఆగ్రో ఇండస్ట్రీస్ (Agros Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళా సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త భవనం మహిళా సంక్షేమ కార్యక్రమాలు, స్నేహ సమూహ సమావేశాలు, సామూహిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తూ వస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో వేగవంతమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎర్వల కృష్ణారెడ్డి, రవీందర్, ఖలేక్, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

