అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dubai | దుబాయ్(dubai)లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరుగాంచిన భారత్‌కు చెందిన ధనవంతుడు billionaire బల్వీందర్ సింగ్ సాహ్నీ జైలు పాలయ్యారు. మనీలాండరింగ్ పాల్పడ్డారని నమోదైన కేసులో దోషిగా తేలడంతో దుబాయి కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1.14 కోట్ల జరిమానా fine విధించింది. అంతేగాకుండా దుబాయ్‌లోని ఆయన ఆస్తులను జప్తు చేయాలని, జైలు శిక్ష పూర్తయ్యాక దేశం నుంచి బహిష్కరించాలని expelled from the country ఆదేశించింది.
Dubai | 2024లో కేసు
భారత్‌కు చెందిన బల్విందర్ సింగ్ Balwinder Singh ఆర్‌ఎస్‌జీ RSG ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీ యూఏఈ UAEతో పాటు అమెరికా US, భారత్ Bharat సహా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే ఆయన డొల్లా కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్లతో దాదాపు రూ.340 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2024లో బల్విందర్సింగ్తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం బల్విందర్ను దోషిగా తేలుస్తూ శిక్ష విధించింది. జైలు శిక్ష, జరిమానాతో పాటు, రూ.340 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. కాగా.. ఈ కేసులో బల్విందర్ పెద్ద కుమారుడికి కూడా శిక్ష పడింది.
Dubai | నంబర్ ప్లేట్‌కే రూ.75 కోట్లు..
రాజ్ సాహ్ని గ్రూప్ (RSG) పేరుతో ప్రాపర్టీ డెవలప్‌మెంట్ కంపెనీని స్థాపించిన బల్వీందర్‌కు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. దీంతో కార్లు కొనుగోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. ఆయనకు ఇన్‌స్టాగ్రామ్‌లో 33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. బల్విందర్‌కు దుబాయ్ అనేక ఆస్తులు ఉన్నాయి. అయితే బల్విందర్ 2016లో రోల్స్ రాయిస్ కార్ కోసం ఏకంగా 33 మిలియన్ దిర్హమ్‌లతో (దాదాపు రూ.75కోట్లతో) నంబరు ప్లేట్ కొనుగోలు చేసి, ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు. తాజాగా జైలుశిక్ష పడడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.
