అక్షరటుడే, ఇందూరు: DTC officer Kishan Naik | నిజామాబాద్ జిల్లాలో మరో అవినీతి కొండ వెలుగుచూసింది. డీటీసీ DTC కిషన్ నాయక్ ఇంటిపై మంగళవారం (డిసెంబరు 23) ఏసీబీ ACB అధికారులు సోదాలు చేపట్టారు. కిషన్ నాయక్ మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఈయన స్వస్థలం నిజామాబాద్. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కిషన్ నాయక్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ రోజు ఉదయం నుంచి హైదరాబాద్‌లోని బోయిన్పల్లి, ఆర్‌ఆర్‌నగర్‌లోని కిషన్ నాయక్ నివాసాలతోపాటు సుమారు 12 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు.
DTC officer Kishan Naik | పలు చోట్ల సోదాలు..
15కు పైగా బృందాలుగా ఏర్పడిన అధికారులు నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌లో సోదాలు జరిపారు. నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డులో ఉన్న రాయల్ ఓక్ బిల్డింగ్, లహరి ఇంటర్నేషనల్ హెూటల్ కిషన్ నాయక్‌కు చెందినవిగా అధికారులు గుర్తించారు. నారాయణ్ ఖేడ్, మెదక్‌లో అక్రమ ఆస్తులు గుర్తించి వాటి డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్ ఫ్రెండ్స్ ఇళ్లలో దాచి ఉంచిన అక్రమ ఆస్తుల దస్త్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబీ సోదాల్లో వెలుగు చూసిన అక్రమ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.36 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. షాపింగ్ కాంప్లెక్స్, పెట్రోల్ బంక్‌లు, హెూటళ్లు, స్థిర, చరాస్తులను భారీగానే గుర్తించారు. బ్యాంకు లాకర్లలో కిలోన్నర బంగారం గుర్తించారు. లెక్కల్లో చూపని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. అవినీతి తిమింగళం కిషన్ నాయక్‌ను అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.