అక్షరటుడే, వెబ్డెస్క్: DSP Transfers Telangana | తెలంగాణలో భారీగా డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 77 మంది డీఎస్పీలను ట్రాన్స్ఫర్ (DSP transfer) చేస్తూ డీజీపీ (DGP) ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్, సైబరాబాద్‌లో పలువురు ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే వెయిటింగ్లో ఉన్న మరి కొందరికి పోస్టింగ్లు ఇచ్చారు. త్వరలో వీరు తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు పది మందిని కీలక పోస్టింగుల నుంచి తప్పించారు. వీరిపై పలు ఆరోపణలు ఉం a నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.





