Homeజిల్లాలునిజామాబాద్​D Srinivas | నగరంలో డీఎస్​ విగ్రహం ఏర్పాటు.. త్వరలో ఆవిష్కరణ

D Srinivas | నగరంలో డీఎస్​ విగ్రహం ఏర్పాటు.. త్వరలో ఆవిష్కరణ

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: D Srinivas | దివంగత మాజీ మంత్రి డి.శ్రీనివాస్ (Late former minister D. Srinivas)​ విగ్రహాన్ని త్వరలో నగరంలో ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించి కంఠేశ్వర్​ బైపాస్​ వద్ద చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతేడాది జూన్​ 29న డీఎస్​ కన్నుమూసిన విషయం తెలిసిందే. తదనంతరం మున్సిపల్​ పాలకవర్గ సమావేశంలో నగరంలో డీఎస్​ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. దానికనుగుణంగా కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తా (Kanteshwar Bypass Crossroads) వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

D Srinivas | అమిత్​షా రానున్న నేపథ్యంలో..

జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని (National Turmeric Board Central Office) ఇటీవల నిజామాబాద్​ నగరంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూరల్​ క్యాంప్​ ఆఫీస్​ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా (Union Home Minister Amit Shah) రానున్నారు. ఆయన డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Must Read
Related News