ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: DS Statue | జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్రమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) రానున్న నేపథ్యంలో జిల్లాలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం.. కంఠేశ్వర్​ బైపాస్ (Kanteshwar Bypass)​ వద్ద డీఎస్​ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.

    DS Statue | రూ. 40లక్షలతో కాంస్య విగ్రహం తయారీ

    ఎంపీ అర్వింద్​ తన సొంత నిధులు రూ. 40లక్షలతో కాంస్య విగ్రహాన్ని తయారు చేయించారు. గుజరాత్​లోని సర్దార్​ వల్లభాయ్​ పటేల్ (Sardar Vallabhbhai Patel) విగ్రహాన్ని రూపొందించిన పద్మ భూషణ్ రామ్ సుతార్ (Padma Bhushan Ram Sutar) అనే వ్యక్తి డీఎస్ విగ్రహాన్ని తయారు చేశారు. తేదీల ప్రకారం 29న మొదటి వర్ధంతి కావడంతో కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా విగ్రహాన్ని ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    DS Statue | పసుపు బోర్డు కార్యాలయంలో ఏర్పాట్లు పూర్తి

    ఆర్యనగర్​లోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయాన్ని పసుపు బోర్డుకు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో కార్యాలయంలో ఫర్నిచర్, ఇతర సామగ్రి సిద్ధం చేశారు. ఇప్పటికే బోర్డు కార్యదర్శిగా ఐఏఎస్ భవానీశ్రీని నియమించారు.

    DS Statue | పాలిటెక్నిక్​ మైదానంలో..

    బైపాస్​ రోడ్డులో డీఎస్​ విగ్రహావిష్కరణ అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో (Polytechnic Ground) ఏర్పాటుచేసిన రైతు సభలో అమిత్​షా పాల్గొని ప్రసంగిస్తారు. సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మహిళలకు, పురుషులకు వేర్వేరు గ్యాలరీలు సిద్ధం చేశారు. వర్షం పడినా సభకు అంతరాయం ఏర్పడకుండా పెద్ద షెడ్డు వేశారు. అలాగే కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఒకరోజు ముందుగానే జిల్లాకు చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసుల సమన్వయంతో సమీక్షించారు.

    Latest articles

    Election Commission | 476 పార్టీలను రద్దు చేయనున్న ఈసీ.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎన్నికల సంఘం (ECI)...

    Nizamabad City | జీపీలకు పూర్తి అధికారంతోనే అభివృద్ధి సాధ్యం

    అక్షర టుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | గ్రామ పంచాయతీలకు పూర్తిస్థాయిలో అధికారం ఇచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని...

    Hair Loss | హస్తప్రయోగం వల్ల జుట్టు రాలుతుందా? నిజమిదే..

    అక్షరటుడే, హైదరాబాద్: Hair Loss | హస్తప్రయోగం గురించి ఇప్పటికీ సమాజంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో...

    Solar Panels | ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ : కలెక్టర్​

    అక్షరటుడే, కామారెడ్డి: Solar Panels | ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు...

    More like this