అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ట్రాఫిక్ పోలీసుల(Traffic Police)పై దాడి చేయడంతో పాటు రోడ్డుపై పడుకొని హంగామా చేశాడు.
నిజామాబాద్ (Nizamabad) నగరంలోని కంఠేశ్వర్ (Kanteswar) ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులు ఆదివారం సాయంత్రం డ్రంకన్ డ్రైవ్(Drunk n Drive) తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరానికి చెందిన గౌతమ్ రెడ్డి మద్యం తాగి బైక్ నడుపుతూ దొరికాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేయడానికి యత్నించగా ట్రాఫిక్ పోలీసులపై దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ శేఖర్‌బాబు కంటికి గాయం అయింది. అంతేగాకుండా మత్తులో ఉన్న గౌతంరెడ్డి రోడ్డుపై పడుకొని హంగామా చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.