అక్షరటుడే, వెబ్‌డెస్క్: drunk drive case | ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. తప్పతాగి వాహనం నడపడమే కాకుండా.. అందరికీ ఊహించని షాక్ ఇచ్చాడు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం (Telangana state) లోని నల్గొండ జిల్లా(Nalgonda district)లో చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు. దీంతో అతనిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ వ్యక్తి నల్గొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన పోలీసులు.. తక్షణం స్పందించి మంటలను ఆర్పివేసి బాధితుడుని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
నల్గొండ పట్టణంలో నర్సింహా అనే వ్యక్తి ఫూటుగా మద్యం తాగాడు. అనంతరం బండిపై డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. తదుపరి చర్యలో భాగంగా అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
drunk drive case | కానిస్టేబుల్కు గాయాలు..
తనపై కేసు నమోదు చేయడంతో తెగ ఆవేశపడిపోయిన నర్సింహా పోలీస్ స్టేషన్లోనే పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. ఊహించని పరిణామానికి విస్తుపోయిన కానిస్టేబుళ్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక కానిస్టేబుల్కు గాయాలు కూడా అయ్యాయి.
కాగా, తీవ్రంగా గాయపడిన నర్సింహాను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిన వ్యక్తి.. నాపైనే కేస్ పెడతారా అంటూ పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
నల్గొండ జిల్లా కేంద్రంలో తప్పతాగి ఇంటికి వెళ్తున్న క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పోలీసులకు చిక్కిన రావిళ్ళ నరసింహ అనే వ్యక్తి… pic.twitter.com/e0jN7xeZIA
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2025