అక్షరటుడే, వెబ్డెస్క్: Cyberabad Police | హైదరాబాద్ నగరంలో మద్యం ప్రియులకు ట్రాఫిక్ పోలీసులు(Traffic police) షాక్ ఇస్తున్నారు. వారాంతంతో దోస్తులతో కలిసి మందు వేసి ఇంటికి వెళ్దామనుకునే వారిపై కొరఢా ఝళిపిస్తున్నారు. హైదరాబాద్(Hyderabad) మహా నగరంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వీటిలో ఎక్కువ శాతం మద్యం తాగి డ్రైవ్ చేయడంతో జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో మందుబాబులు రెచ్చిపోయి తాగుతున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు.
Cyberabad Police | వారాంతంలో స్పెషల్ డ్రైవ్
రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) చర్యలు చేపట్టారు. డ్రంకన్ డ్రైవ్(Drunk Driving) చేస్తున్న వారి కోసం శని, ఆదివారాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 306 మందిని పోలీసులు అరెస్ట్(Police Arrest) చేశారు. ఇందులో 246 ద్విచక్ర వాహనాలు, 9 త్రిచక్ర వాహనాలు, 50 నాలుగు చక్రాల వాహనాలు, ఒక భారీ వాహనం ఉన్నాయి. నిందితుల్లో ఎక్కువ మంది 21 నుంచి 40 ఏళ్లలోపు వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించారు.