HomeతెలంగాణDrunk and Drive Tests | హైదరాబాద్​లో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. ఎంతమంది చిక్కారో తెలుసా?

Drunk and Drive Tests | హైదరాబాద్​లో డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. ఎంతమంది చిక్కారో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drunk and Drive Tests | హైదరాబాద్​ నగరంలో మందుబాబులు పెరిగిపోతున్నారు. నగరంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. మద్యం మత్తులో డ్రైవింగ్​ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్​లో జాలీగా పెగ్గేసి ఇళ్లకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే అలాంటి వారికి పోలీసులు షాక్​ ఇస్తున్నారు. హైదరాబాద్​ నగరంలో ప్రతి శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రంకన్​ డ్రైవ్​(Drunk and Drive) తనిఖీలు నిర్వహిస్తున్నారు.

సైబరాబాద్​ కమిషనరేట్(Cyberabad Commissionerate)​ పరిధిలో శని, ఆదివారాల్లో పోలీసులు డ్రంకన్​ డ్రైవ్​ స్పెషల్​ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 627 మంది మందుబాబులు దొరికారు. ఇందులో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనదారులు ఉండడం గమనార్హం. మందుబాబులపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Drunk and Drive Tests | జైలుశిక్ష వేస్తున్న మారనితీరు

డ్రంకన్​ డ్రైవ్​ కేసులో గతంలో జరిమానా మాత్రమే వేసేవారు. అయితే ప్రస్తుతం కోర్టులు మద్యం మత్తులో డ్రైవింగ్​ చేసే వారికి జైలు శిక్ష కూడా విధిస్తున్నాయి. మద్యం మోతాదును బట్టి జైలు శిక్ష వేస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అంతేగాకుండా భారీ జరిమానాలు సైతం విధిస్తున్నాయి.

Drunk and Drive Tests | ప్రమాదాలకు కారణం

దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు(Road Accidents) జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మద్యం మత్తులో డ్రైవింగ్​ చేయడంతోనే జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు డ్రంకన్​ డ్రైవ్​తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నా.. మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ముఖ్యంగా యువత మద్యం తాగి రోడ్డుపై అతివేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు.